‘దోస్త్ మేరా దోస్త్… టూ హై మేరా దోస్త్’ అంటూ ఫ్రెండ్షిప్ పాట పాడుకునే టైపు… మెగా ఫ్యామిలీ అండ్ బాలీవుడ్ భాయ్ సల్మాన్. మెగాస్టార్ వారసుడు రామ్‌చరణ్ హిందీలో సినిమా చేసినప్పుడు సల్మాన్ దగ్గరుండి జాగ్రత్తలు చెప్పాడు. అలాగే, సల్మాన్ హైదరాబాద్ వస్తే వీలైన ప్రతిసారి మెగాస్టార్ ఇంటికి వెళతారు. ఈ దోస్తీ ఎప్పట్నుంచో వుంది. అందుకనే, చరణ్ కోసం తన పర్సనల్ ఫిట్నెస్ ట్రయినర్ రాకేష్ ఉడియార్ని హైదరాబాద్ పంపాడు సల్మాన్. గతంలో ‘ధ్రువ’ కోసం ఒకసారి రాకేష్ హైదరాబాద్ వచ్చాడు. ‘ధ్రువ’లో చరణ్ సిక్స్‌ప్యాక్ చూపించాడు కదా. అప్పుడు, అతనికి ట్రయినింగ్ ఇచ్చింది రాకేషే. ‘ధ్రువ’ తరహాలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాలోనూ కండలు తిరిగిన దేహంతో కనిపించాలని చరణ్ కసరత్తులు చేస్తున్నారు. అందుకోసం రాకేష్ ట్రయినింగ్ ఇస్తున్నారు. చరణ్ అడిగిన వెంటనే అతణ్ణి సల్మాన్ పంపించాడని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న బోయపాటి సినిమా లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. ఈ షెడ్యూల్లోనే చరణ్ జాయిన్ కానున్నారు.