స్టార్ హీరో తనయుడైనా సరే తనకంటూ ఓ ఇమేజ్ కోసం ప్రాకులాడుతూనే ఉన్నాడు నాగ చైతన్య. కెరియర్ స్టార్టింగ్ లోనే లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించాడని అనిపించినా ప్రస్తుతం ఉన్న యువ హీరోల పోటీల్లో తాను కూడా సత్తా చాటాలనుకుంటున్నాడు. అందుకే వరుసబెట్టి సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ రీమేక్ లో నటిస్తున్న చైతు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
అందులో ఒకటి సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోది కాగా మరోటి రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా అట. వీరా, రైడ్ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అబ్బాయితో అమ్మాయి అంటూ వచ్చి అపజయాన్ని అందుకున్న రమేష్ వర్మ చైతుకి ఓ కథ వినిపించాడట. అక్కినేని నాగార్జున సలహాతో ఈ సినిమా చేస్తున్నాడట చైతన్య. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెడ్గె కథానాయికలుగా నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం రకుల్ ఉంటే సినిమా హిట్ అన్నట్టే ఉంది పరిస్థితి.. వరుసెంట స్టార్ హీరోల అవకాశాలు కొట్టేస్తున్న ఈ భామ అక్కినేని కుర్ర హీరోతో మొదటిసారి జోడి కడుతుంది. ఇక మాస్క్ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హడ్గే తన చూపులతో ప్రేక్షకులను వల్లో వేసుకుంది. ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో తెలుగు ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించింది ఈ బ్యూటీ. మరి లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న చైతు టాలీవుడ్ క్రేజీ బ్యూటీలైన ఇద్దరు భామల రొమాన్స్ తో ఏవిధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.