సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి కాల్ లిస్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. కాల్ లిస్ట్‌ను బయటకు తీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మీడియాకు లీక్ చేసింది. ఇంకేముంది మీడియాకు పండగే పండగ. అమీర్ ఖాన్ కూడా రియా కాలర్ జాబితాలో ఉన్నారు. అమీర్ ఖాన్ కు రియా ఒకసారి ఫోన్ చేయగా… అమీర్ ఖాన్ నుంచి మూడు ఎస్ఎంఎస్లు వచ్చినట్టు ఈడీ గుర్తించింది.
ఇక తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు రియా 30 సార్లు ఫోన్ చేసింది. రకుల్ 14 సార్లు ఫోన్ చేసింది. ఈ జాబితాలో దగ్గుబాటి రానా కూడా ఉన్నాడు. దగ్గుబాటి రాణాకు కూడా రియా ఏడుసార్లు ఫోన్ చేయగా… నాలుగు సార్లు ఆయన రియాకు ఫోన్ చేసినట్టు తేలింది. ఇక నటులు ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్, ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ కు పలు సార్లు రియా ఫోన్ చేసింది. అయితే.. ఇలా రియా కేసు కాల్ రికార్డులను బయట పెట్టి..మీడియాకు ఇవ్వడం ఏమిటన్న చర్చ నడుస్తోంది.
కానీ అది లీక్ కాబట్టి ఎవరూ బాధ్యత తీసుకోరు. మరో వైపు ఈ కేసు విషయాన్ని ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తేలిగ్గా తీసుకున్నారు. సుశాంత్ మృతి కేసు పెద్ద విషయమేమీ కాదని తేల్చేశారు. రియా కాల్ డేటాలో ఉన్న వారందరినీ సీబీఐ కానీ..ఈడీ కానీ పిలిస్తే.. కరోనా వార్తలతో రొటీన్ గా గడిపిస్తున్న మీడియాకు పండగే పండగ..!