సాధారణంగా హీరోలకే అభిమాన సంఘాలుంటాయి. కథానాయికల్ని అభిమానిస్తారు గానీ… ‘నేను మీ ఫ్యాన్’ అని చెప్పుకొని, ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టుకొనేంత సీన్ ఉండదు. అయితే తమిళ ప్రేక్షకుల్ని ఇందుకు మినహాయించాలి. టాలీవుడ్లో మాత్రం ఈ సంప్రదాయం లేదు. కథానాయికల పుట్టిన రోజులకు అన్నదానం, రక్తదానం, కేట్ కట్ చేయడాలూ ఇలాంటి హంగామా ఉండదు.ఎక్కడైనా కనిపిస్తే చుట్టు మూగేసి, ఫొటోలూ, ఆటోగ్రాఫులూ అడుగుతారంతే. అందుకే హీరోయిన్లు కూడా తమ ఫ్యాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం లాంటివి జరగవు. కానీ రకుల్ మాత్రం… ట్రెండ్ సెట్ చేసింది. తన పుట్టిన రోజుని తన అభిమానుల (?) సమక్షంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
రకుల్ ప్రీత్‌సింగ్ పుట్టిన రోజు ఈ వేళ. ఎప్పుడూ సెట్లో బర్త్‌డే జరుపుకొనే రకుల్ ఈసారి కాస్త భిన్నంగా ఆలోచించింది. ఓ కాన్టెస్ట్ నిర్వహించి, అందులో గెలిచిన తన ఫ్యాన్స్‌ని తన దగ్గరకు పిలిపించుకొంది. వాళ్లతో సరదాగా గడిపి.. వాళ్ల మధ్య కేక్ కట్ చేసింది. కాసేపు చిట్ చాట్ కూడా చేసింది. దాంతో రకుల్ అభిమానుల (?) ఆనందాలకు అవధి లేకుండా పోయింది. సాధారణంగా ఈ ట్రెండ్ హీరోలు ఫాలో అవుతుంటారు. తమ ఫ్యాన్స్ మధ్యన కేక్ కట్ చేస్తే వాళ్లకది సంబరం కిందే లెక్క. హీరోయిన్లు ఈ తరహాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం అరుదైన విషయమే. నో డౌట్.. రకుల్ టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్. తనంటే అభిమానించే వాళ్లూ ఉంటారు. వాళ్లందరినీ ఓచోట చేర్చి, వాళ్లతో కాసేపు గడపడం చూస్తుంటే.. రకుల్ కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నట్టే అనిపిస్తోంది. వచ్చే యేడాది నుంచి రకుల్ అభిమాన సంఘం ఒకటి ఏర్పాటైపోయి అన్నదానం, రక్తదానం చేసినా చేసేయొచ్చు. చూద్దాం.. ఆ ముచ్చట కూడా!