తేజ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ తో ఓ సినిమా, రానాతో మరో సినిమా చేస్తున్నారు. వీటిలో ముందుగా గోపీచంద్ సినిమానే పట్టాలెక్కుతుంది. ఈ చిత్రానికి ‘అలివేలు వెంటకరమణ’ అనే పేరు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. అలివేలు పాత్ర కోసం అన్వేషణ మొదలైంది. ఈ పాత్రలో కాజల్ గానీ, అనుష్క గానీ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
కాజల్ ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చినా, తేజ మరో ఆప్షన్ కోసం వెదుకుతున్నారు. అనుష్క ని కథానాయికగా ఎంచుకోవడం రూమరే. తేజ దృష్టిలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు రకుల్ ప్రీత్, మరొకరు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి డేట్లు ఇప్పుడు దొరకడం అంత ఈజీ కాదు. తన చేతిలో `విరాట పర్వం` ఉంది. అందుకే అన్ని విధాలా రకుల్ అయితే బెటర్ అని… తేజ భావిస్తున్నారు. ఇది వరకు గోపీచంద్ – రకుల్ కలిసి ‘లౌక్యం’లో నటించారు. ఆ సినిమా హిట్టయ్యింది కూడా. సో.. సెంటిమెంట్ పరంగానూ రకుల్ బెస్ట్ ఆప్షన్ అని తేజ భావిస్తున్నట్టు సమాచారం. సాయి పల్లవి కాల్షీట్లు అనూహ్యంగా దొరికేస్తే తప్ప… కథానాయిక విషయంలో మార్పు లేకపోవొచ్చు.