అదృష్టమంటే రకుల్‌ప్రీత్ సింగ్ దే! చేతి నిండా బోలెడు సినిమాలు.. అయినా ఆమె వెంటే పడుతున్నారు దర్శక నిర్మాతలు. మొన్నే బ్రూస్లీ సినిమాతో ఓ భయంకరమైన ఫ్లాప్ ఇచ్చింది. అయినా సరే హీరోలు కూడా రకుల్‌నే కోరుకొంటున్నారు. అందుకే.. రకుల్ రేంజు తారా స్థాయికి చేరుకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో నటించిన సరైనోడు విడుదలకు సిద్ధమైంది. మరోవైపు తని ఒరువన్ పట్టాలెక్కబోతోంది. అటు చరణ్‌తోనూ, ఇటు బన్నీతోనూ సయ్యాట ఆడేస్తున్న రకుల్ సాయిధరమ్‌తేజ్, వరుణ్ తేజ్ చిత్రాల్లోనూ కథానాయికగా ఎంపికైందని సమాచారం. రకుల్ ఇక్కడితో సంతృప్తి పడిపోవడంలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కావాలంటోంది.
నాకు పవన్ అంటే చాలా ఇష్టం.. ఆయనతో కలసి నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటోంది రకుల్. దీన్ని బట్టి రకుల్ పెద్ద స్కెచ్చే వేసినట్టు అర్థమౌతోంది. బన్నీ, చరణ్, వరుణ్‌తేజ్, సాయి ధరమ్.. వీళ్లందరితో కలసి నటిస్తూ… పవన్‌తో కూడా జోడీ కట్టేస్తే మెగా హీరోల్ని మొత్తం రౌండప్ చేసేసినట్టుంటుంది. ఎందుకంటే బ్రూస్లీలోనే ఓ ఫ్రేమ్‌లో ఈ అమ్మడు చిరంజీవితోనూ నటించేసింది. సో.. ఒక్క శిరీష్‌తో తప్ప మెగా హీరోలందరితోనూ నటించిన క్రెడిట్ దక్కించుకోవచ్చని ప్లాన్ వేస్తోందేమో? సర్దార్ గబ్బర్ సింగ్ తరవాత వెంటనే మరో సినిమా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు పవన్. అందులో కథానాయికగా రకుల్‌ని ఎంచుకొంటారేమో చూడాలి మరి.