సాధారణంగా మన సినిమాల్లో హీరోలదే డామినేషన్. ఈమధ్య విలన్లూ, కమెడియన్లు కూడా… ఆధిపత్యం చలాయిస్తుంటారు. కానీ కథలో సగం భాగం పంచుకొనే కథానాయిక మాత్రం ఎప్పుడో గానీ డామినేషన్ చేయదు. ఆ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడొచ్చిందట. రకుల్ కథానాయికగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. వచ్చే వారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగచైతన్యతో పోలిస్తే.. ఈ సినిమాలో రకుల్ పాత్ర ఆకట్టుకొనేలా ఉందట. ఫస్టాఫ్‌లో చైతూ పాత్రని రకుల్ అన్నివిధాలా డామినేట్ చేసేసిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో భ్రమరాంబగా కనిపించబోతోంది రకుల్. ఈ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన విధానం చాలా బాగుందట. తన క్యారెక్టరైజేషన్ చుట్టూ నడిపించిన సన్నివేశాలు హిలేరియస్‌గా పండాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రకుల్ కూడా ఈ పాత్రపై చాలా నమ్మకం పెట్టుకొంది.
”భ్రమరాంబ పాత్ర నా కెరీర్లో ఓ మైలు రాయి. ఇప్పటి వరకూ ఇలాంటి పాత్రలో నేను నటించలేదు. నా నటన నాకే కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక యెత్తు.. ఈ సినిమా మరో ఎత్తు” అంటోంది. 100 % లవ్‌లో కూడా చైతూ పాత్రని తమన్నా డామినేట్ చేసేసింది. అప్పుడు మహాలక్ష్మి పాత్రలో తమన్నా ఆ సినిమా క్రెడిట్ అంతా పట్టుకెళ్లిపోయింది. ఇప్పుడు.. భ్రమరాంబ తయారైందన్నమాట. ఎవరి డామినేషన్ ఉంటేనేం..? చైతూ ఖాతాలో హిట్టు పడితే అదే చాలు.