సినిమా సినిమాకు హీరోయిన్స్ క్రేజ్ ఏవిధంగా పెరుగుతుందో వారు తీసుకునే రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగి పోతుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచుతూ అటు ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలను ఆకర్షించింది. ప్రస్తుతం అమ్మడు స్టార్ హీరోలందరితో వరుసెంట సినిమాలు చేసేస్తుంది. రీసెంట్ గా బ్రూస్ లీలో చరణ్ పక్కన హాట్ హాట్ గా రెచ్చిపోయిన అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు (వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది.
బ్రూస్ లీ టాక్ ఎలా ఉన్నా సినిమాలో అమ్మడు అందాలు యమా కిక్ ఎక్కించాయి. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలతో చేస్తున్న అమ్మడిని తన తనయుడు బెల్లంకొండ శ్రీను పక్కన హీరోయిన్ గా చేయించే ప్రయత్నం చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న అమ్మడు ఆ సినిమాలో నటించడానికి కొటిన్నర రెమ్యునరేషన్ అడిగిందట. అమ్మడు అడిగిన రెమ్యునరేషన్ కి కూడా ఓకే అన్నాడట బెల్లంకొండ సురేష్.
గుండెజారి గల్లంతయ్యిందే, ఒకలైలా కోసం సినిమాలతో హిట్ కొట్టిన డైరక్టర్ విజయ్ కుమార్ కొండా ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. మొత్తానికి బెల్లంకొండ శ్రీను హీరో అని రేటు పెంచిందో మరి గ్లామర్ డోస్ పెంచాలని రేటు పెంచేసిందో తెలియదు కాని నిన్న మొన్ననే కొటే ఎక్కువ అనుకున్న అమ్మడు ఇప్పుడు కోటిన్నర డిమాండ్ చేస్తుంది. అమ్మడు ఇలానే ఫుల్ ఫాంలో ఉంటే మిగతా హీరోయిన్స్ సంగతి ఏమవుతుందో చూడాలి మరి.