”నేను మిలటరీ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. క్రమశిక్షణ నా ఆయుధం.. నేను తప్పు చేసే అవకాశమే లేదు” అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి తప్పూ చేయలేదట. సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా… తన వైపు నుంచి ఎలాంటి తప్పూ లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చిందట. అదే.. తనని కాపాడుతోందని, అందుకే తనకు అవకాశాలొస్తున్నాయని చెబుతోంది రకుల్. ”హిట్టు, ఫ్లాప్ గురించి నేనెప్పుడూ ఆలోచించను. ఆసినిమా కోసం నేనేం చేశాను? వంద శాతం ప్రతిభ కనబరిచానా, లేదా? అన్నదే కీలకం. ఈ విషయంలో ప్రతీ సినిమాలోనూ నేను విజయం సాధించా. రకుల్ బాగా కష్టపడుతుంది అనే పేరు తెచ్చుకొన్నా. అందుకే.. నా కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది” అంటోంది రకుల్.
అంతేకాదు.. ఫ్లాప్ సినిమాలో నటించినా రకుల్‌కి ఎప్పుడూ బాధ కలగలేదట. పైపెచ్చు ఫ్లాప్ సినిమాలు కూడా తనకు సంతృప్తి కలిగించాయట. ఫ్లాప్లోనటించడం వల్లే ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చని, అందుకే పరాజయాల్ని ఇష్టంగా స్వీకరిస్తానని అంటోంది రకుల్. ఒకట్రెండు ఫ్లాపులయితే ఒకే. కానీ అదే పనిగా ఫ్లాపులు కొడుతుంటే ఐరెన్ లెగ్ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని రకుల్ తెలుసుకొంటే మంచిది.