సినిమా వాళ్లన్న తర్వాత రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వచ్చే కోట్ల డబ్బు ఏం చేయాలో తోచక ఇన్వెస్ట్ మెంట్ చేసేస్తుంటారు. అయితే ఈ జాబితాలో హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఉంటారు. మొన్నటిదాకా రెస్టారెంట్, శారీ సెంటర్స్ అంటూ బిజినెస్ చేసిన భామలు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇక వారిలో అందాల భామ రకుల్ మరింత ముందుకు ఆలోచించి ఫిట్ నెస్ సెంటర్ స్టార్ట్ చేస్తుంది.
కొద్దిరోజుల క్రిందట రకుల్ ప్రీత్ సింగ్ చాలా కష్టపడుతూ జిమ్ చేసిన వీడియో నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘ఎఫ్45’ ఫిట్ నెస్ సెంటర్ కోసం అమ్మడు ఇదంతా చేసింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ ఫిట్ నెస్ సెంటర్ హైదరబాద్ ఫ్రాంచైజీ రకుల్ చేజిక్కించుకుందట. అందుకోసమే మొన్న ఆ వీడియో కూడా పబ్లిసిటీ కోసం బయటకు వచ్చేలా చేసిందట.
హైదరాబాద్ గచ్చిబౌలిలో మొదలవనున్న ఈ ఫిట్ నెస్ సెంటర్ ఈ నెల 20న సిని ప్రముఖుల సమక్షంలో రిబ్బన్ కట్ జరుగనున్నదట. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది కాబట్టి తన సోదరుడు అమన్ కు ఈ ఫిట్ నెస్ సెంటర్ కార్యక్రమాలను చూసుకునేలా ప్లాన్ చేసింది రకుల్. మొత్తానికి రకుల్ కూడా కొత్త వ్యాపారం పెట్టేసిందన్న మాట. మరి అమ్మడి సినిమాల్లానే ఈ బిజినెస్ కూడా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం.