రకుల్ ప్రీత్ సింగ్ సుడి ఓ రేంజులో తిరుగుతోంది. చేతి నిండా అవకాశాలున్నాయి. వద్దన్నా సినిమాలు వచ్చిపడిపోతున్నాయి. మొన్నటికి మొన్న మహేష్ బాబు – మురుగదాస్ సినిమాలో అనుకోకుండానే అవకాశం వచ్చింది. ఓ వైపు మెగా హీరోలంతా రకులే కావాలంటున్నారు. ఇప్పుడు అక్కినేని హీరోల వంతు వచ్చింది. తాజాగా నాగచైతన్య దృష్టి రకుల్‌పై పడినట్టు తెలుస్తోంది. నాగచైతన్య – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం త్వరలోనేపట్టాలెక్కనుంది. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకోనున్నట్టు సమాచారం. ఇటీవల కల్యాణ్ కృష్ణ రకుల్‌ని కలిసి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినట్టు సమాచారం. అయితే రకుల్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట.
దానికి కారణం.. బిజీ షెడ్యూలే అని తెలుస్తోంది. డేట్లు ఇవ్వగలనో – లేదో ఇప్పుడే చెప్పలేనని రకుల్ కల్యాణ్ కృష్ణకు చెప్పేసిందట. దాంతో రకుల్ పేరు హోల్డ్‌లో పెట్టారు. ఒకవేళ అన్నీ కుదిరితే.. చైతూతో రకుల్ తొలిసారి జోడీ కట్టేయడం ఖాయం. సోగ్గాడే చిన్ని నాయినతో ఆకట్టుకొన్న కల్యాణ్ కృష్ణ, ఆ సినమా రిలీజ్ అవ్వకుండానే నాగ్ మనసు
కొల్లగొట్టేశాడు. అందుకే.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో మరో సినిమా చేయడానికి డీల్ కుదిరింది. ఈ సినిమాకి కల్యాణం అనే పేరు పెట్టినట్టు వార్తలొచ్చాయి. అయితే కల్యాణ్ వాటిని ఖండించాడు.