సర్దార్ గబ్బర్‌సింగ్ తరవాత ఎస్.జె సూర్యతో పవన్ కల్యాణ్ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో పవన్ కల్యాణ్ ఓ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించనున్నాడు. కథానాయికగా శ్రుతిహాసన్ని కూడా ఎంచుకొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల శ్రుతిహాసన్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు టాక్. పవన్ సినిమాకు కాల్షీట్లు సర్దుబాటు చేయలేక, శ్రుతి చేతులెత్తేసిందని, ఈ విషయంలో చిత్రబృందం ఇప్పుడు కంగారు పడుతోందని తెలుస్తోంది. ఎందుకైనా మంచిదని రకుల్ ప్రీత్‌సింగ్ డేట్ల గురించి ఆరా తీస్తున్నార్ట. జూన్, జులైలలో రకుల్ డేట్లు ఖాళీగా ఉన్నాయేమో అని చిత్రబృందం కనుక్కొంటోందని, ఒకవేళ రకుల్ ఫ్రీ అయితే.. పవన్ తో తొలిసారి జట్టు కట్టే ఛాన్స్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై చిత్రబృందాన్ని అడిగితే ”శ్రుతిహాసన్ డేట్లు కన్ఫ్యూజన్లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పటి వరకూ మేం ప్రత్యామ్నాయం ఆలోచించలేదు. ఒకవేళ ఈ సినిమాలో నేను నటించలేను.. అని శ్రుతి చెబితే, అప్పుడు ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే మా సినిమాలో కథానాయిక శ్రుతినే” అంటున్నారు. అంటే చివరి క్షణాల వరకూ శ్రుతి డేట్ల కోసం ట్రై చేస్తారన్నమాట. కుదరని పక్షంలో రకుల్‌ని ఎంచుకొనే ఛాన్సుంది.