సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్న పాపమో.. ప్రజల్లో ఉండే అటెన్షన్ కారణమో కానీ.. సెలబ్రిటీలపై ఈగ వాలితో మీడియా సంస్థలు హోరెత్తిస్తాయి. ఇక కేసుల్లో పేర్లు వినిపిస్తే ఊరుకుంటాయా..?. ఆ సెలబ్రిటీల మానసిక స్థితి.. వారి కుటుంబసభ్యుల ఆవేదన ఎవరు పట్టించుకుంటారు..? ప్రస్తుత బాలీవుడ్లో చాలా మందిది అదే పరిస్థితి. రకుల్ ప్రీత్ సింగ్‌ది అదే. తన పని తాను చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిన ఆమెను మీడియా వెంటాడింది. కేసు గురించి బయటకు రాగానే షూటింగ్ నుంచి వెళ్లిపోయిందని.. అదనీ.. ఇదనీ రాయడం ప్రారంభించారు. ఈ అతి ఇంగ్లిష్ మీడియాలోనే కాదు.. రకల్ అనే సరికి ..తెలుగులోనే కనిపించింది. దీంతో ఆమె అందరిలా.. ఇంట్లో తలుపులేసుకోలేదు.. కోర్టుకెళ్లింది.
డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందియ. రియా చక్రవర్తి హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు సారా అలీఖాన్ పేర్లు వెల్లడించినట్లు ఎన్సీబీ అధికారులు చెప్పినట్లు మీడియా ప్రచారం చేసేస్తోంది. తన పరువుకు భంగం కలిగిసత్ున్నారని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్రయింంచారు. మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ వార్తలను మీడియాలో ప్రసారం చేయకుండా సమాచారశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. రకుల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ చావ్లా ధర్మాసనం.. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తూ పిటిషన్ ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది
సినీ తారలపై ఎలాంటి వార్తలు అయినా రాసుకోవచ్చని.. ఆ హక్కు తమకు ఉందని.. మీడియా సంస్థలు భావిస్తూంటాయి. టీఆర్పీల కోసం వారి జీవితాలతో ఆడుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం రియా చక్రవర్తి విషయంలో.. వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. సొంతంగా విచారణలు నిర్వహించేస్తూ.. రాజకీయ ఉద్దేశాలతో మీడియా దిగజారిపోతోంది. దాని బారిన పడకుండా రకుల్ త్వరగానే ప్రయత్నించింది. రకుల్ బాటలోనే మరికొంత మంది న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంది.