కమల్‌హాసన్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోరు. లంచాలపై శంకర్ సంధించిన బ్రహ్మాస్త్రమది. ముసలి పాత్రలో కమల్ నటన అపూర్వం.. అద్భుతం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు శంకర్. ఇప్పటికే షూటింగ్ మొదలైయింది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. కాగా ఇప్పుడు ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిందని టాక్.
ఈ సీక్వెల్ కోసం హీరో సిద్దార్ద్ ని కూడా ఎంపిక చేశాడు శంకర్. ఇందులో ఓ కీలక పాత్ర సిద్దుది. ఇప్పుడు ఈ పాత్రకు జోడిగా రకుల్ ని ఎంపిక చేశారని వినిపిస్తుంది. ఇందులో సిద్దు- రకుల్ మధ్య సెపరేట్ లవ్ ట్రాక్ వుందని, సినిమాలో ఇదే కీలకం కానుందని అంటున్నారు. భారతీయుడులో కుర్ర కమల్ కి మనిషా కొయిరాల మధ్య లవ్ ట్రాక్ నడిపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే తరహలో సిద్దు లవ్ ట్రాక్ వుండబోతుందని చెబుతున్నారు. రకుల్ అంటే అటు సౌత్ తో పాటు బాలీవుడ్ కి కూడా పరిచయం ఉన్నే స్టారే. సిద్దు కూడా బాలీవుడ్ కి బాగా పరిచయం. భారతీయుడు2ని బాలీవుడ్ లో కూడా భారీగా విడుదల చేయడానికి ప్లాన్. అందుకే.. రకుల్ ని ఛాయిస్ చేసుకున్నాడట శంకర్.