రకుల్ ప్రీత్ సింగ్ కు మొదటి నుంచి వ్యాపారాలపై ఆసక్తి వుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో సొంతగా ఫిట్ నెస్ ఫ్రాంచైజ్‌లు నడిపారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించారు. ఇప్పుడు సినిమాల్లో ఆమె జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఇటివలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరోసారి తన బిజినెస్ ఆలోచనలకు పదనుపెట్టింది. ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది. మొదటి నుంచి డైట్ పై ఆసక్తి వున్న రకుల్ .. హెల్తీ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఈసారి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. రకుల్ కు హైదరాబాద్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడీ బిజినెస్ కూడా హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ వారంలోనే ఈ హెల్తీ ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించబోతుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఇండియన్ 2 లో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు తన ఫోకస్ అంతా కొత్తగా మొదలుపెడుతున్న ఫుడ్ బిజినెస్ పైనే వుంది.