అబ్బాయ్ రామ్‌చరణ్‌ని బాబాయ్ పవన్‌కల్యాణ్ అడిగారు. అడగటం అంటే అబ్బాయ్‌ని నేరుగా అడగలేదు కానీ… ప్రజల ముందు, మీడియా ముందు అడుగుదామనుకుంటున్నానని చెప్పారు. శ్రీకాకుళంలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని రామ్‌చరణ్‌ని అడుగుదామని అనుకుంటున్నట్టు పవన్‌కల్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ మాటలు రామ్‌చరణ్ చెవిన పడ్డాయి. వెంటనే ఆయన స్పందించారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాను బాధిత ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటే బావుంటుందనే అభిప్రాయాన్ని కల్యాణ్ బాబాయ్ వ్యక్తం చేశారు. బాబాయ్ ఈ ఐడియాతో రావడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. సహాయం చేసే స్థితిలో నేనుండటం నా అదృష్టంగా భావిస్తున్నా. బాబాయ్ సలహాను ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నా. నా టీమ్‌తో ఈ విషయమై డిస్కస్ చేశా. వాళ్ళు బాధిత ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేయగానే, అతి త్వరలో ఈ విషయమై ప్రకటన చేస్తా’’ అని రామ్‌చరణ్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.