‘గేమ్ ఛేంజర్’ గురించి సుకుమార్, దిల్ రాజు, శంకర్.. ఇలా ఎవరు మాట్లాడినా, ఈ సినిమాతో రామ్ చరణ్ నట విశ్వరూపం కనిపిస్తుందని, ఇంటర్నేషనల్ అవార్డులు కూడా ఖాయమని ఘంటాపథంగా చెప్పేశారు. సుకుమార్ అయితే.. చరణ్‌కు నేషనల్ అవార్డు వస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పుడు తమన్ కూడా అదే అంటున్నాడు. కాకపోతే.. చరణ్‌తో పాటు అంజలికి కూడా నేషనల్ అవార్డు వస్తుందని ముందే ప్రకటించేశాడు.
రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపొందిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో అంజలి కీలకమైన పాత్ర పోషించింది. ఆమె నటన, తన క్యారెక్టర్ ‘అన్ ప్రెడిక్టబుల్‌గా’ ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు ముందు నుంచీ చెబుతున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తానికి ఈ పాత్రే కీలకం. ఆయా సన్నివేశాల్లో అంజలి నటన సర్ప్రైజింగ్ గా ఉంటుందని, తన స్క్రీన్ ప్రెజెన్స్ షాక్ ఇస్తుందని, ఈ సినిమాతో అంజలికి నేషనల్ అవార్డు రావడం ఖాయమని తమన్ చెప్పేశాడు. సూర్య గురించి కూడా తమన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. చరణ్ – సూర్యల మధ్య వచ్చే ఓ ఎపిసోడ్ ఫ్యాన్స్‌కు మంచి హై ఇస్తుందని, అదే సీన్లో చరణ్ విశ్వరూపం చూపిస్తాడని అంటున్నాడు తమన్. ‘రంగస్థలం’ సినిమాకే చరణ్‌కి నేషనల్ అవార్డు వస్తుందని ఆశించారు. కానీ తృటిలో తప్పింది. ఆ ఛాన్స్ ‘గేమ్ ఛేంజర్’తో వస్తే అంతకంటే కావల్సిందేముంది?
జనవరి 1న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు జనవరి 2కి వాయిదా పడింది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ నూతన సంవత్సరం సందర్భంగా రేపు రావొచ్చు.