బ్యాంకాక్‌లో బ్యాడ్ వెదర్ రామ్‌చరణ్ సినిమా షూటింగుకి బ్రేకులు వేసింది. అందువల్ల, ఇష్టం లేనప్పటికీ ప్యాకప్ చెప్పక తప్పలేదు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ కోసం మెయిన్ కాస్ట్ అండ్ క్రూ సోమవారం బ్యాంకాక్ బయలుదేరింది. మంగళవారం నుంచి షెడ్యూల్ స్టార్ట్ కావాలి. లొకేషన్ రెడీ. ఆర్టిస్టులు రెడీ. టీమ్ అందరూ రెడీ. షూటింగ్ కాసేపటిలో మొదలు కాబోతుందని అందరూ రెడీ అవుతోన్న సమయంలో అనూహ్యంగా వర్షం మొదలైంది. వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురు చూసి చూసి చివరకు ప్యాకప్ చెప్పేశార్ట. వర్షం ఆగకుండా కురవడంతో చాలాసేపు ఎదురు చూసినోళ్లు చివరకు రిలాక్స్ అయ్యారు. ఆ విధంగా బ్యాంకాక్‌లో ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్ అయ్యింది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.