అఖిల్ మాజీ ప్రేయసి, పెళ్లి పీటల వరకూ వచ్చి వెనక్కి తగ్గిన అమ్మాయి శ్రియా భూపాల్ పెళ్లిలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్. అఖిల్‌తో ఆమె ప్రేమలో పడటం, నిశ్చితార్ధం జరిగాక పెళ్లి క్యాన్సిల్ కావడం తెలిసిన విషయాలే. తరవాత అఖిల్ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టేసి సినిమాలపై దృష్టి పెట్టాడు. అఖిల్‌తో నిశ్చితార్ధం క్యాన్సిల్ అయిన కొన్ని రోజులకు అనిందిత్ రెడ్డితో శ్రియా భూపాల్ నిశ్చితార్ధం జరిగింది. ఉపాసన పిన్ని సంగీతారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిల కుమారుడే అనిందిత్. వరుసకు రామ్‌చరణ్‌కి బావమరిది అన్నమాట. త్వరలో అనిందిత్, శ్రియా భూపాల్ పెళ్లి. బావమరిది పెళ్లికి చరణ్ వెళ్లకపోతే ఎలా? అందుకని, బోయపాటి సినిమాకి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ప్రస్తుతం ప్యారిస్‌లో ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందులో చరణ్, ఉపాసన దంపతులతో పాటు మరికొందరు ప్రముఖులు సందడి చేస్తున్నారు.