ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ఈ ఏడాది సంచలనం సృష్టించిన సినిమా. సంక్రాంతికి విడుదలైన సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు జై హనుమాన్ కూడా రెడీ కాబోతోంది. అయితే హనుమాన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ పాత్రలో చిరంజీవి అయితే బావుటుందని చాలా మంది అభిప్రాయం. ప్రశాంత్ వర్మ కూడా చిరుని ఊహించుకునే హనుమాన్ ని విగ్రహాన్ని డిజైన్ చేశాని చెప్పాడు.
ఇప్పుడు సెకండ్ పార్ట్ లో హనుమాన్ పాత్రధారిని చూపించాలి. ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచనల్లో వుంది చిత్ర యూనిట్. ఇప్పుడు చిత్ర నిర్మాతలలో ఒకరైన చైతన్య రెడ్డి హనుమాన్ పాత్రకి ఎవరైతే బావుంటారో చెప్పారు. ” నా పర్శనల్ ఛాయిస్ అయితే రామ్ చరణ్. చిరంజీవి గారు కూడా బావుంటారు. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా ఆ పాత్ర అద్భుతంగా వుంటుంది. అయితే సినిమా విషయంలో మొత్తం భారం హనుమాన్ పైనే వదిలేశాం. ఎవరి ద్వారా ఈ కథ చెప్పాలని అనుకుంటారో అంతా హనుమంతుల వారి చేతిలో వుంది’ అని చెప్పుకొచ్చారు చైతన్య. హనుమాన్ తర్వాత వారు నిర్మించిన ‘డార్లింగ్’ సినిమా ఈనెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తోంది.