ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిన్న `ఆర్.ఆర్.ఆర్`లో అల్లూరి సీతారామరాజు లుక్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు `ఆచార్య`లోని `సిద్ధ` లుక్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈసారి చరణ్ సోలోగా రాలేదు. చిరుకి తోడుగా వచ్చాడు. చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో చరణ్ `సిద్ద`గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చిరు – చరణ్ కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలుంటాయి. `సిద్ధ`గా చరణ్ సోలో లుక్ ని విడుదల చేస్తారేమో అనుకుంటే.. చిత్రృందం షాకిచ్చింది. ఓ మెగా పోస్టర్ ని విడుదల చేసింది. `ధర్మానికి ధైర్యం తోడైన వేళ` అంటూ కొరటాల ఈ ఫొటోకి ట్యాగ్ లైన్ జోడించాడు. నక్సల్ గెటప్, చేతిలో తుపాకులు, తీక్షణమైన చూపులతో.. తండ్రీ కొడుకులిద్దరూ కదన రంగంలోకి దిగుతున్నట్టున్న ఫోజు అది. కచ్చితంగా మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ లా ఉంది. మే 13న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాజల్, పూజా హెగ్డేలు కథానాయికలుగా నటిస్తున్నారు.
ఆచార్య "సిద్ధ " …#HappyBirthdayRamcharan#Siddha #Acharya#AcharyaOnMay13 pic.twitter.com/Nk34oWYKRI
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2021