రామ్ చరణ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ .. ఇప్పుడు ఈ మాటే ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. తండ్రి మెగాస్టార్ చిరంజీవిని లాంచ్ చేయడానికి ‘కొణిదెల ప్రొడక్షన్ హౌస్’ ని స్టార్ట్ చేశాడు చరణ్. నిజంగా ఎవరూ ఊహించని గ్రాండ్ ఎంట్రీ ఇది. బేసిగ్గా తండ్రి కొడుకుని లాంచ్ చేస్తాడు. కానీ ఇక్కడ కొడుకే మళ్ళీ తండ్రిని రీలాంచ్ చేయడం.. బహుసా అది చిరు- చరణ్ లకే సాధ్యపడింది. మెగా 150 అదిరిపోయే విజయాన్ని అందుకుంది. కానీ అక్కడితో అయిపోలేదు. చిరు ..151భాద్యతని కూడా చరణే తీసుకున్నాడు. ప్రతిష్టత్మక ‘సైరా’ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. పూర్తయింది. మరో కొన్ని గంటల్లో ఆ సినిమాని చూడబోతున్నారు ప్రేక్షకులు. కానీ అంతకంట ముందే నిర్మాతగా రామ్ చరణ్ విజయం సాధించేశాడని ఆ సినిమాకి పని చేసిన జనం చెప్పుకుంటున్నారు.
చాలా పెద్ద కాన్వాస్ లో ఈ సినిమా తెరకెక్కించాడు చరణ్. బాలీవుడ్ బిగ్ బిగ్ అమితాబ్ బచ్చన్ ని తీసుకొచ్చాడు. ఆయనే కాదు దాదాపు స్టార్లు అంతా ఈ సినిమాలో వున్నారు. విదేశాల నుండి శాంకేతిక నిపుణులని నియమించాడు. కళ్ళు చెదిరే సెట్స్ వేయించాడు. వేలాది మంది కార్మికులు పని చేశారు. ఇప్పుడు వాళ్ళంతా చెబుతున్న మాట ఒకటే ”చరణ్ .. ది బెస్ట్ ప్రొడ్యూసర్”. దీనికి కారణం షూటింగ్ జరిగినంత కాలం నటులని, టెక్నికల్ డిపార్ట్మెంట్ ని, కార్మికులని , సెట్ బాయ్ నుండి లైట్ మ్యాన్ వరకూ చరణ్ అందరికీ గొప్ప ఆదిత్యం ఇచ్చాడట చరణ్. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అందరికీ బహుమతులు ఇచ్చి ఖుషి చేశాడట. ఓ గొప్ప సినిమాకి పని చేశామనే భావన ఇప్పుడు సైరా టీంలో వుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం రామ్ చరణ్ ని ఒక హీరోగా కంటే ఒక నిర్మాతగానే ఎక్కువ అభిమానించిందట సైరా టీం. మొత్తానికి చరణ్ సైరా టీం మనసుని గెలుచుకున్నాడు. ఓ హిస్టారికల్ సినిమాకి నిర్మాతగా మొదటి సక్సెస్ అప్పుడే చరణ్ ఖాతాలో పడిపోయింది.