రంగస్థలం సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్చరణ్. మరోవైపు బోయపాటి శ్రీను సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం కూడా కుదిరింది. జనవరి 19న ఈ సినిమాని లాంఛనంగా మొదలెడతారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి.కానీ ఎవ్వరికీ ఖరారు చేయలేదు. రకుల్ ప్రీత్ సింగ్ కే ఎక్కువ ఛాన్స్ ఉందని తెలుస్తుంది. భద్ర తరవాత.. దమ్ముని మినహాయిస్తే బోయపాటి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన `జయ జానకి నాయక`కి ఆ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి కారణం… బోయపాటి స్టామినానే. ఈసారీ చరణ్ కోసం ఓ మాస్, కమర్షియల్ కథని రాసుకున్నాడు బోయపాటి. సినిమా మొత్తం అచ్చంగా బోయపాటి శైలి తప్పకపోయినా.. కథలో ఓ కొత్త పాయింట్ ఉందట. రాజస్థాన్ నేపథ్యంలో సినిమా సాగబోతోందని, షూటింగ్ అంతా అక్కడే జరగబోతోందని తెలుస్తోంది.