రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ కి వెళ్లబోతోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం రామ్‌ని ఎంచుకోవాలని బోయపాటి భావిస్తున్నాడట. రామ్ అంటే.. ‘దేవదాస్’ రామ్ కాదు… `సాక్షి` రామ్! సాక్షి పత్రికలో ‘ఫ్యామిలీ’ పేజీ చూసుకుంటున్న రామ్‌కి సినిమాలంటే ఆసక్తి. దర్శకత్వం, నటన, రచన.. ఇష్టం. రామ్ చరణ్ సినిమాలో తనో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. తన గ్యాంగ్‌లో రామ్ కనిపిస్తాడని, నందమూరి హీరో తారకరత్నకీ ఓ పాత్ర ఉందని తెలుస్తోంది. రాజస్థాన్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఎక్కువ శాతం షూటింగ్ రాజస్థాన్‌లోనే జరుగుతుంది. నటీనటులు, మిగిలిన సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందిప్పుడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.