హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాశ్మీర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అమరనాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. మన భూతల స్వర్గమైన కాశ్మీర్లో ఉన్న అమరనాథ్ను సందర్శించుకుని తల్లి కోరిక నెరవేర్చానని, మహాశివుని ఆశీస్సులు పొందానని చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్ అక్కడ ఉన్న పారా మిలటరీ దళాలతో దిగిన ఫోటోలను ఆ పోస్టులలో పెట్టారు. సముద్రమట్టానికి 13,000 అడుగుల ఎత్తున ఉండే అమరనాథ్ దేవాలయంలో శివలింగం ప్రతి సంవత్సరం మే నుంచి ఆగస్టువరకు దర్శనమిస్తుంది. మరోవైపు మగధీర చిత్రంలోని డైలాగులను అనర్గళంగా చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన బుడతడు ఎట్టకేలకు పాఠశాలలో చేరాడనికూడా చరణ్ సోషల్ మీడియాలో ఇవాళ పేర్కొన్నారు. ఆ బుడతడు పాఠశాలలో ఉన్న ఫోటోలనుకూడా పోస్ట్ చేశారు. ఇటు చరణ్ సొంత విమానయాన సంస్థ టర్బో మేఘ ఎయిర్లైన్స్, పుష్కరాల ప్రారంభం సందర్భంగా రెండు మూడు రోజులలో ఏపీలో సర్వీసులు ప్రారంభించనుందని చెబుతున్నారు.