మెగా ఫ్యాన్స్ అందరి దృష్టీ చిరంజీవి 150వ సినిమాపైనే. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ… అప్పుడే హంగామా మొదలెట్టేశారు. ఈ సినిమా గురించి చిన్న వార్త తెలిసినా.. అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి నిర్మాత రామ్‌చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తన అభిమానులతో పంచుకొన్నాడు. కొంతసేపటి క్రితం ఫేస్ బుక్‌లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశాడు చెర్రీ. ఈ సందర్భంగా 150వ సినిమా ప్రస్తావనకు వచ్చింది. ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ పెట్టినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెర్రీ క్లారిటీ ఇచ్చాడు. మంచి టైటిల్ కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పాడు.
ఈ సినిమాలో నటిస్తారా? అని అడిగితే ”నాకు నటించాలని లేదు. కానీ ఒక పాటలో కనిపించే ఛాన్స్ ఇస్తే మాత్రం వదులుకోను” అన్నాడు. ఈ సినిమా జనవరి 14న రావడం ఖాయమని.. సంక్రాంతి సంబరాలకు సిద్ధంగా ఉండమని అభిమానులకు స్వీట్ న్యూస్ చెప్పేశాడు చరణ్. సో.. చిరు, చరణ్ కలసి ఓ పాటలో డాన్స్ చేయడం ఖాయమన్నమాట.