తెలుగు సినిమా స్టార్ హీరోస్ అందరూ కూడా రియలైజ్ అవుతున్నారు. సినిమా సక్సెస్‌లో కథలు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో అర్థం చేసుకుంటూ ఉన్నారు. మంచి కథ చెప్పడం కోసం ఇమేజ్‌ని పక్కన పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. నిజానికి కథా బలమున్న సినిమాలు, మంచి సినిమాల వైపు వీళ్ళు నడిచేలా చేసింది కూడా మార్కెట్టే. గతంలో మాస్ జనాలు మరీ ఎక్కువ ఉండేవారు. వాళ్ళు చూస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్నట్టు ఉండేది పరిస్థితి. అప్పుడున్న బడ్జెట్స్కి ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ చూస్తే చాలు…హిట్ గ్యారెంటీ అన్న పరిస్థితి ఉండటంతో ఇమేజ్ కోసమే సినిమాలు చేశారు. కానీ మారిన పరిస్థితుల్లో బడ్జెట్స్ పెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాస్ జనాలకు కూడా ప్రపంచ సినిమా దగ్గరైపోయింది. దాంతో వాళ్ళు కూడా మరీ రొటీన్ అంటే థియేటర్స్ వైపు వెళ్ళడం లేదు. మరోవైపు పెరిగన బడ్జెట్స్ నేసథ్యంలో ఓ టాప్ స్టార్ సినిమా హిట్ అవ్వాలంటే మాస్, ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడాల్సిన పరిస్థితి. కొంత కాలం క్రితం వరకూ తెలుగు సినిమాను నైజాం మార్కెట్ శాసించేది. ఇప్పుడు మాత్రం ఓవర్సీస్ మార్కెట్ డిసైడ్ చేస్తోంది.
మాస్, రెగ్యులర్ అండ్ ఏ స్సెషాలిటీ లేకుండా హీరోల ఇమేజ్ కోసమే తీసుకునే సినిమాలకు ఓవర్సీస్ ప్రేక్షకులు చాలా దూరం. దాంతో స్టార్ హీరోలు అందరూ కూడా మారారు. ఎన్టీఆర్ లాంటి ఊరమాస్ హీరో కూడా తన లుక్, యాక్టింగ్ స్టైల్‌తో పాటు కథలను ఎంచుకోవడం విషయంలో కూడా గొప్ప విజ్ఙత ప్రదర్శించాడు. అందుకే టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి కథా బలమున్న సినిమాలతో మంచి హిట్స్ కొట్టడంతో పాటు తన క్రేజ్‌ని కూడా పెంచుకున్నాడు. క్లాస్, ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా తన సినిమాలకు వచ్చేలా చేసుకున్నాడు. తను, తన స్టార్ ఢం కంటే కూడా క్యారెక్టరే ఎక్కువ కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. అలాగే సినిమాను ప్రేమించేవాళ్ళందరికీ తన సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు.
గట్టిగా రెండు హిట్ సినిమాలు కూడా పడక ముందే మెగా పవర్ స్టార్ ట్యాగ్‌తో మాస్ ఇమేజ్‌కి ఫిక్స్ అయిన చరణ్ మాత్రం ఒకే మూసలో కొట్టుకుపోతున్నాడు. రచ్చ సినిమా నుంచి కూడా ఒకే రకం సీన్స్, యాక్టింగ్‌తో ప్రేక్షకులను విసిగించాడు. ఆ ఇంపాక్ట్ మొత్తం చరణ్ కెరీర్ పైన పడింది. ఓవర్సీస్, క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులకు చాలా దూరమయ్యాడు చరణ్. తమిళ్ సూపర్ హిట్ థ్రిల్లర్ థనీ ఒరువన్ సినిమాను చరణ్ రీమేక్ చేస్తున్నాడనే సరికి చాలా మంది చరణ్ థాట్స్ మారి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. రీసెంట్గా ప్రి లుక్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. అయితే ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక మాత్రం అలా ఆశించిన వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారు. అసలు కొత్త సినిమా లుక్లా కనిపించడం లేదు. పోస్టర్ పైన ఉన్న టైటిల్ చూసి కొత్త లుక్ అనుకోవాల్సిందే కానీ వేరే ఏ విధంగానూ ఓ కొత్త పోస్టర్ చూస్తున్న ఫీలింగ్ రాలేదు. ఓ కొత్త క్యారెక్టర్ని పోర్ట్రెయిట్ చే్స్తున్నట్టు కాకుండా సెల్ కెమేరాతో ఫొటో దిగినట్టుగా ఫోజ్ ఇఛ్చాడు చరణ్. ఆ తర్వాత వచ్చే ఫొటోస్, టీజర్, ట్రైలర్…సినిమాలో కూడా తన ఇమేజ్, తను, మెగా ఫ్యాన్స్ అనుకుంటూ మళ్ళీ రచ్చ నుంచి బ్రూస్ లీ వరకూ కనిపించిన చరణే కనిపించాడంటే మాత్రం తమిళ్ హిట్ సినిమాను కాదు…ఆస్కార్ అవార్డ్ కొట్టిన సినిమాను తీసుకొచ్చి రీమేక్ చేసినా చరణ్ కెరీర్‌కి కొత్తగా వచ్చే ఉపయోగమైతే ఏమీ ఉండదు.