రామ్‌చరణ్ తేజ్, సురేందర్‌రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ధృవ ఎలా ఉండబోతుందో ఈ రోజు శాంపిల్ చూపించారు. రచ్చ సినిమా నుంచి కూడా ఒకే రకం యాక్టింగ్, మాస్ మసాలా కథలు అంటూ మూసలో కొట్టుకుపోయిన చరణ్, చాలా మంది తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు. బ్రూస్ లీ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన ఘాటు పంచ్ దెబ్బకు ఆ విషయం రియలైజ్ అయిన చరణ్ ఇప్పుడు రూటు మార్చాడు. కొత్తగా ఏదైనా ట్రేై చేద్దామన్న ఉద్ధేశ్యంతో తమిళ్లో సూపర్ హిట్ అయిన ‘థనీ ఒరువన్’ సినిమాను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి చరణ్ థాట్స్ ఒక్కటే మారాయా? లేక నటనా శైలి కూడా మారిందా? క్రిటికల్లీ అక్లైమ్డ్ క్లాసిక్ హిట్‌గా నిలిచిన థనీ ఒరువన్కి మనవాళ్ళు న్యాయం చేయగలరా? ‘ధృవ’ టీజర్‌ని విశ్లేషిద్దాం.
తమిళ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌ని చాలా మందిని తీసేసుకున్నారు కాబట్టి సాంకేతికంగా మాత్రం ‘థనీ ఒరువన్’ స్థాయిలోనే తెరకెక్కించినట్టున్నారు. తెలుగులో రామ్ చరణ్ రేంజ్ స్టార్ హీరో నటిస్తున్నాడు కాబట్టి బడ్జెట్ సౌకర్యాలు కూడా పెరుగుతాయి. అందుకే టెక్నికల్‌గా వందశాతం సక్సెస్ అయ్యారు. సూపర్బ్ ఫొటోగ్రఫితో పాటు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. టీజర్ కోసం కట్ చేసిన షాట్స్ అన్నీ కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా తమిళ్ నుంచి తీసేసుకున్నారు. అది ప్లస్సయ్యింది. సాంకేతికంగా నేను చాలా అడ్వాన్స్‌గా ఆలోచిస్తానని మొదటి సినిమా నుంచే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు సురేందర్‌రెడ్డి. ఇప్పుుడు ధృవలో కూడా ఆ విషయంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మంచి మార్కులు కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ లుక్స్, ఫిజిక్ కూడా చాలా బాగుంది. కానీ మనవాడు డైలాగ్ పలికిన విధానం మాత్రం మరీ గొప్పగా ఏమీ లేదు. స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫుల్ కమిట్మెంట్ ఉన్న ఓ కుర్రాడు కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా చెప్పినట్టుగా ఉండాల్సిన డైలాగులను రామ్ చరణ్ మాత్రం రెగ్యులర్‌గా తెలుగు హీరోలు పంచ్ డైలాగులు పలికే స్టైల్లో చెప్పేశాడు. టీజర్‌తోనే సినిమా మొత్తాన్ని విశ్లేషించలేం కానీ సాధారణంగా మన సినిమా వాళ్ళు టీజర్, ట్రైలర్స్‌లో అద్భుతః అని వాళ్ళకు అనిపించిన కంటెంట్‌ని మాత్రమే మనకు చూపిస్తారు. మరి టీజర్లోనే ఇలా ఉంటే సినిమాలో చరణ్ యాక్టింగ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. రేపు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఒరిజినల్లో చేసిన జయం రవితో చరణ్‌ని పోల్చడం ఖాయం. కెరీర్లోనే ఫస్ట్ టైం… ఓ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో మనముందుకు వస్తున్న చరణ్…ధృవ క్యారెక్టర్‌కి న్యాయం చేయగలిగాడో? లేదో? లేక శభాష్ చరణ్ అనే రేంజ్లో యాక్టింగ్ చేసేశాడో…ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.