గేమ్ ఛేంజర్ రిజల్ట్ మెగాఫ్యాన్స్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం కంటే, ట్రోలింగ్కి ఎక్కువగా గురైంది. ఆర్.ఆర్.ఆర్ తరవాత చరణ్ నుంచి రాదగ్గ ప్రాడక్ట్ కాదన్నది అందరి మాట. చరణ్ తన స్టామినాకు సరిపడా సినిమా చేయలేదు. ఇది చరణ్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకొంటారు. అయితే ఆ వెలితిని ‘పెద్ది’ గ్లింప్స్ తీర్చేసింది. ఒక్క డైలాగ్, చివర్లో.. చరణ్ కొట్టిన సిక్సర్ – పెద్ది సినిమాపై అంచనాల్ని ఆకాశానికి తాకేలా చేశాయి.
నిజానికి చరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలకు గ్లింప్స్ కట్ చేయడం చాలా కష్టం. నిమిషం నిడివిలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ప్రయత్నాలు చేయడం మామూలు విషయం కాదు. అలాగని కంటెంట్ చెప్పలేదు. జస్ట్.. క్యారెక్టర్ని పరిచయం చేశాడంతే. చాలామందికి ఈ గ్లింప్స్‌లో రంగస్థలం వైబ్స్ కనిపించాయి. చరణ్ లుక్‌కి అంతా ఫిదా అయిపోతున్నారు.
బుచ్చిబాబు పట్టుకొన్న కథ, చెప్పాలనుకొన్న విషయంలో మాస్ కంటెంట్ ఉంది. అది గ్లింప్స్ చూస్తే అర్థమైపోయింది. అతనికి మంచి టెక్నికల్ సపోర్ట్ కూడా దొరికింది. మైత్రీ మూవీస్ ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు ఇక బుచ్చిలాంటి వాళ్లకు కావల్సింది ఏముంది? స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిజం ఉంటుంది, మాస్ ఎలివేషన్లు ఉంటాయి, ఉత్కంఠత కనిపిస్తుంది. వాటిని మిక్స్ చేయగలిగే నేర్పు దర్శకుడికి ఉన్నప్పుడు విజయం నల్లేరుపై నడకే. కాబట్టి ‘పెద్ది’ నుంచి మినిమం గ్యారెంటీ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
గ్లింప్స్‌కి వచ్చిన స్పందన పట్ల చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లుక్‌తో… ఆడియో రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక గ్లింప్స్ వచ్చాక ఓటీటీ, శాటిలైట్ రైట్స్ హాట్ కేకులుగా మారడం ఖాయం. ఈ డీల్స్ కూడా ఈ నెలలో క్లోజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా గ్లింప్స్ ఎఫెక్టే.