‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఉక్రెయిన్ లో షూట్ చేశారు. సినిమాకి సంబధించిన మేజర్ ఎపిసోడ్లు ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. అయితే ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ అక్కడి నుంచి కొద్ది రోజులకే యుద్ధం మొదలైయింది. ఈ అంశంపై ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో టీం స్పందించింది. రాజమౌళి మాట్లాడుతూ..”ఆర్ఆర్ఆర్ షూట్ చేసినప్పుడు నాకు అసలు అక్కడి రాజకీయ పరిస్థితులు గురించి ఏ మాత్రం ఐడియా లేదు. అక్కడ యుద్ద వాతావరణం వుందని ఇండియా వచ్చిన తర్వాత తెలిసింది. చాలా మంది స్నేహితులు ఉక్రెయిన్ లో ఎలా షూట్ చేశారని అడిగారు. అక్కడి షూట్ చేసినప్పుడు మాకు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఎదురుకాలేదు. అంతా నార్మల్ గా వుంది. తారక్, ఎన్టీఆర్ .. అక్కడి ప్రజలతో సరదా గడిపేవారు. నేను కూడా నా డ్రైవర్, అక్కడి అసిస్టెంట్ తో కలిసిమాట్లాడే వాడిని. యుద్ధం మొదలైన తర్వాత వారి ఫోన్ చేసి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నా. పరిస్థితులన్నీ మళ్ళీ నార్మల్ అవ్వాలని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ షూటింగ్ మంచి అనుభూతి. అక్కడికి వెళ్ళినపుడు మాకు ఆక్కడి రాజకీయ పరిస్థితులు గురించి తెలీదు. యుద్ద మేఘాలు కమ్ముకున్న చోటని షూటింగ్ జరుగుతునప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. అక్కడి ప్రజలు మమ్మల్ని ఎంతో అభిమానించారు. నా సెక్యురిటీ టీంతో మాట్లాడా. కొంత డబ్బులు కూడా వాళ్ళ ఎమౌంట్ కి పంపించా. 80ఏళ్ల వాళ్ళ నాన్న కూడా గన్ పట్టుకోవడం చాలా బాధించింది. అక్కడ మళ్ళీ మామూలు పరిస్థితి నెలకొనాలి” అని ఆశించాడు చరణ్.