రామ్ చరణ్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఫైనల్ గా రిలీజ్ అయింది. ‘బేసిగ్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు. కానీ వాడి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు’ అనే వాయిస్ తో మొదలైన టీజర్ శంకర్ స్థాయిలో మ్యాసీవ్ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాని పరిచయం చేసింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తుందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ టీజర్ లో గెటప్స్ ని రివిల్ చేశారు. ఒక స్టూడెంట్ గా, సివిల్ సర్వెంట్ గా, స్టూడెంట్ లీడర్ గా, పొలిటికల్ లీడర్ గా భిన్నమైన క్యారెక్టరైజేషన్ గెటప్స్ లో కనిపించారు చరణ్. ఇందులో సివిల్ సర్వెంట్, పొలిటికల్ లీడర్ గెటప్స్ చాలా కొత్తగా ఉన్నాయి.
శంకర్ టేకింగ్ మెస్మరైజింగ్ గా ఉంది. కన్నుల విందు అనిపించేలా భారీ స్థాయిలో కొన్ని సీన్స్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. చాలా అద్భుతమైన లొకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేశారు. అవి గ్లింప్స్ లా కనిపించాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.
టీజర్ ముఖ్య ఉద్దేశం ఆడియన్స్ ని టీజ్ చేయడం. ఈ టీజర్ లో టీజింగ్ పాయింట్ భలే కుదిరింది. అసలు ఈ టీజర్ లో కథ జోలికి వెళ్ళలేదు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏం చేసింది అనేది టీజర్ హుక్ పాయింట్. కైరా అద్వానీ, ఎస్ జె సూర్య, సముద్రఖని.. ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ .. వాడు ఏం చేశాడు.. ఏం చేశాడు.. ఏం చేశాడు.. అనే డైలాగ్ తో ఒక క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. చివరిలో రామ్ చరణ్ ‘ఐయాం అన్ ప్రెడిక్టబుల్’ అని చెప్పడం రియల్లీ సర్ ప్రైజింగ్. నిజంగానే ఈ టీజర్.. అన్ ప్రెడిక్టబుల్.
శంకర ఏదో అన్ ప్రెడిక్టబుల్ గానే ప్లాన్ చేశాడు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోరు యాక్షన్ సీక్వెన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది. దిల్ రాజు ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి శంకర్, రామ్ చరణ్ ఎదో అన్ ప్రెడిక్టబుల్ గానే ప్లాన్ చేశారు. మరి రామ్ ఏం చేశాడో తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాలి.