చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్, నయనతార, సుదీప్ లాంటి స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. రామ్‌చరణ్ కూడా ఓ చోట తళుక్కున మెరవబోతున్నాడని టాక్. తనకేం పాత్ర లేకపోయినా.. కొన్ని సెకన్ల పాటు మెరుపులా వచ్చి మాయమైపోతాడని తెలుస్తోంది. చిరు ఖైది నెం.150కి చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అందులో ఓ పాటలో కనిపించాడు. చిరుతో అమ్మడూ.. కుమ్ముడూ అంటూ స్టెప్పులేశాడు. చిరు, చరణ్‌లను అలా చూస్తే ఫ్యాన్స్ ఖుష్ అయిపోయారు. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలోనూ చరణ్ కనిపించే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2019 వేసవిలో విడుదల చేయనున్నారు.