`ఇస్మార్ట్ శంకర్`తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు పూరి జగన్నాథ్. అంతకు ముందు పూరీ వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ ఒక్క హిట్ తో మళ్లీ స్టార్ హీరోల చూపు పూరిపై పడింది. అప్పటి వరకూ పూరి ని లైట్ తీసుకున్న వాళ్లు కూడా.. `కథ ఏమైనా ఉందా` అంటూ ఎంక్వైరీలు మొదలెట్టారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాడు పూరి. ఆ వెంటనే ఓ బాలీవుడ్ సినిమా లైన్ లో ఉంది.
ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి పూరి కి పిలుపు అందిందని సమాచారం. రామ్ చరణ్ – పూరి కాంబో సెట్ చేయడానికి తెర వెనుక ముమ్మకమైన ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. రామ్ చరణ్ తొలి అడుగు పూరితోనే మొదలైంది. `చిరుత` తరవాత వీరిద్దరి కాంబో రిపీట్ అవ్వలేదు. మళ్లీ ఆ అవశం ఇప్పుడొచ్చింది. పూరితో సినిమా చేయడానికి చరణ్ సిద్ధంగా ఉన్నాడని.. చరణ్ కాంపౌండ్ నుంచి పూరికి సంకేతాలు వెళ్లాయి. పూరి కూడా `రెడీ` అంటూ… ఈ కాంబో కి ద్వారాలు తెరచుకున్నట్టే. ఈ లాక్ డౌన్ సమయంలో పూరి కొన్ని కొత్త కథలు సిద్ధం చేసుకున్నాడు. అందులో చరణ్‌కి సెట్ అయ్యేది ఏమైనా ఉంటే.. `చిరుత` కాంబోని మళ్లీ అతి త్వరలో చూసేయొచ్చు.