రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. సుకుమార్ ‘రంగస్థలం’ షూటింగ్ ఇంకా జరుగుతుండడంతో చరణ్ బోయపాటి సినిమాకి డేట్స్ ఇవ్వలేదు. గడ్డం తీసిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వస్తారు. ‘రంగస్థలం’ షూటింగ్ ఫిబ్రవరి రెండో వారంతో పూర్తవుతుందని సమాచారం. బోయపాటి సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మూడో వారంలో మొదలవుతుంది. అందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ షెడ్యూల్ స్టార్టింగ్ నుంచి షూటింగులో జాయిన్ అవుతాడు. రామ్ చరణ్ ఫిబ్రవరి నెలాఖరున జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఒకవేళ ‘రంగస్థలం’లో మళ్లీ చిన్న చిన్న షాట్స్, ప్యాచ్ పార్క్ చేయాలంటే గడ్డం కావాలి. బోయపాటి సినిమా కోసం అది తీసేస్తే కష్టం అవుతుందని ఫిబ్రవరి నెలాఖరు నుంచి డేట్స్ ఇచ్చారట. ఈ సెకండ్ షెడ్యూల్లో చరణ్, వివేక్ ఒబెరాయ్ తదితరులపై ముఖ్య సన్నివేశాలు తీయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.