మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్….అన్న ట్యాగ్‌లైన్ చరణ్పైన చాలా పెద్ద బరువే అయ్యింది. వెరీ యంగ్ ఏజ్‌లో లవ్ స్టోరీస్ చేసి యూత్‌కి బాగా కనెక్ట్ అయి ఆ తర్వాత మాస్ బాట పట్టాల్సిన చరణ్‌ని కాస్తా స్టార్ ఇమేజ్ చట్రంలో బిగించేసింది. మొదటి సినిమా నుంచే చిరంజీవి ఫ్యాన్స్ అయిన మాస్‌ని అట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి చాలా విషయాల్లో మెగా స్టార్ చిరంజీవిని గుర్తుచేయడం చరణ్‌కి తప్పనిసరైంది. అదే టైంలో చిరంజీవి సినిమాలకు దూరమవ్వడంతో ఆయన అభిమానులందరూ కూడా చరణ్లోనే చిరంజీవిని చూసుకోవాలని, అలా మెగాస్టార్ ప్లేస్‌కి రామ్ చరణ్ ఎదగాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రొటీన్ సినిమాలు, రొటీన్ యాక్టింగ్‌తో ప్రేక్షకులకు విసుగొచ్చేలా చేశాయి. అదే విషయాన్ని రియలైజ్ అయిన చరణ్ కూడా ధృవ సినిమాతో కాస్త కొత్తదనం చూపించాడు.
కానీ చరణ్‌ని సరికొత్తగా, వెండితెరకు మరోసారి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నాన్ని సుకుమార్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో తండ్రిని గుర్తుకు తెచ్చే హెయిర్ స్టైల్‌నే ఫాలో అయ్యాడు చరణ్. అందుకే స్క్రీన్ పైన కాస్త ఎక్కువ ఏజ్ ఉన్నవాడిలాగా కూడా కనిపించాడు. కానీ సుకుమార్ మాత్రం చరణ్‌లో ఉన్న యంగ్ లుక్‌ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఖైదీ నెంబర్ 150 సక్సెస్‌ని పురష్కరించుకుని సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈవెంట్లో చరణ్‌ని చూసినవాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ అయితే చాలా కొత్తగా కనిపిస్తోంది. వెరీ యంగ్ అండ్ ఛార్మింగ్ లుక్‌లో సూపర్బ్‌గా ఉన్నాడు చరణ్. మొదటి సినిమా ఆర్యతోనే లవ్ స్టోరీస్ విషయంలో తన మార్క్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేసుకున్న సుకుమార్…..ఇప్పుడు చరణ్‌తో తను తీస్తున్న లవ్‌స్టోరీ ఈ మెగా పవర్ స్టార్‌ని ఏ రేంజ్లో చూపిస్తాడా? అన్న అంచనాలు అప్పుడే అభిమానుల్లో మొదలయ్యాయి. పెర్ఫార్మెన్స్, లుక్స్ విషయంలో ది బెస్ట్ అని చెప్పుకునే స్థాయి సినిమా ఇప్పటి వరకూ చరణ్‌కి ఒక్కటి కూడా లేదు. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న సినిమాతో క్రిటిక్స్‌ని, యూత్‌ని కూడా ఏ రేంజ్లో మెస్మరైజ్ చేస్తాడో చూడాలి మరి. ప్రస్తుతానికి చరణ్ హెయిర్ స్టైల్‌కి మాత్రం డిస్టింక్షన్ మార్క్స్ పడుతున్నాయి.