రచ్చ తరవాత మళ్లీ మెగా హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాలని తెగ ఉబలాటపడుతున్నాడు సంపత్ నంది. ఛోటా మేస్త్రీ స్ర్కిప్టు పట్టుకొని రెండేళ్ల నుంచి చరణ్ వెంట పడుతూనే ఉన్నాడు. చరణ్ కూడా ఆ టైటిల్‌కి టెమ్ట్ అయిపోయాడు. లైన్ కూడా నచ్చింది. దాంతో సంపత్ నంది ఆశల పల్లకిలో ఊరేగుతున్నాడు. అయితే.. సినిమా చేస్తాడా, చేయడా, చేస్తే ఎప్పుడు అనే విషయాల్లో చరణ్ ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదని సమాచారం. ప్రస్తుతం తని ఒరువన్ సినిమా పనుల్లో ఉన్నాడు చరణ్. ఆ సినిమా తరవాత కొరటాల శివ తో ఓ ప్రాజెక్టు ఒప్పుకొన్నాడు. కనీసం కొరటాల శివ తరవాతైనా తన సినిమాని ఓకే చేయొచ్చుగా అన్నది సంపత్ పాయింట్.
‘ఈ కథ నాకు వద్దు’ అని క్లియర్‌గా చెప్పేస్తే మరో హీరోకి చెప్పి ఒప్పించుకొంటాను కదా, ఈ ఆలస్యం ఎందుకూ.. అని తెగ ఫీలవుతున్నాడట సంపత్ నంది. అప్పుడు పవన్ కల్యాణ్ కూడా అంతే. గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు ఇస్తానని చెప్పి రెండేళ్లు తిప్పించుకొని చివరికి హ్యాండిచ్చాడు. ఇప్పుడు చరణ్ కూడా తిప్పించుకొని ఐ యామ్ సారీ అంటూ చెబితే సంపత్ పరిస్థితి ఏమిటో మరి.