గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ నిరుత్సాహపరడంతో రామ్‌చరణ్ ఇప్పుడు సందిగ్థంలో పడిపోయాడు. ఈసారి హిట్టు కొట్టకపోతే ఇక అంతే సంగతులు. అందుకే సేఫ్ ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో తని ఒరువన్ రీమేక్‌ని ఎంచుకొన్నాడు. ప్రొడక్షన్ కూడా చేతిలోఉంచుకోవడానికి గీతా ఆర్ట్స్‌కి ఈ సినిమాని అప్పగించాడు. కాస్టింగ్‌లో బలం తీసుకురావడానికి అరవింద్ స్వామికి భారీ పారితోషికం ఇచ్చి.. బతిమాలి మరీ.. ఈ సినిమాలోకి లాక్కొచ్చారు. అంతా బాగానే ఉంది. అయితే…ఈ సినిమా షూటింగ్ మాత్రం నత్తనడక నడుస్తోంది. సినిమా ఎప్పుడో మొదలైనా.. ఇప్పటి వరకూ 20 శాతం కూడా కంప్లీట్ అవ్వలేదు. మధ్య మధ్యలో వస్తున్న భారీ బ్రేక్‌ల వల్ల సురేందర్ రెడ్డి మూడ్ కూడా మారిపోతోందట. అసలు ఈ సినిమాపై రామ్‌చరణ్ కి ఆసక్తే లేదని, అందుకే.. ఈ సినిమాపై కాన్సట్రేషన్ చేయటం లేదని తెలుస్తోంది,
నిజానికి ఒకనాకొ దశలో ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేయాలనుకొన్నాడట చరణ్. కానీ… అప్పటికే అందరికీ అడ్వాన్సులు ఇచ్చేసి ఉండడంతో.. ఈసినిమాని ముక్కుతూ మూలుగుతూ లాక్కురావాల్సివస్తోందని తెలుస్తోంది. దానికి తోడు.. అల్లు అరవింద్ కూడా చెర్రీకి క్లాస్తీసుకొన్నాడట. ఇలాగైతే ఈ సినిమా ఈ యేడాదిలో విడుదల చేయలేం.. అని గట్టిగా చెప్పేశాడట. దాంతో.. చరణ్ ఈ సినిమాని యుద్దప్రాతిపదికపై పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఏదోలా ఈ సినిమాకి శుభం కార్డు వేసేసి.. పనైపోయిందనిపించుకోవాలట. మనసు పెట్టి చేసిన సినిమాలే పల్టీలు కొడుతున్నాయి. మనోడు మరీ ఇలా చేస్తే ఎలా??