విశ్వక్సేన్ ని పొగడ్తలతో ముంచెత్తారు రామ్ చరణ్. విశ్వక్సేన్ తాజా చిత్రం ఓరి దేవుడా’ . అక్టోబరు 21న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న చరణ్. విశ్వక్ పర్సనాలిటీ పై ప్రశంసలు కురిపించారు. ‘‘ఇచ్చిన మాటపై నిలబడేవారంటే నాకు ఇష్టం. తప్పో ఒప్పో మాటిస్తే విశ్వక్ కూడా నిలబడతాడనే పేరుంది. అతని వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్.” అని చెప్పుకొచ్చారు.
”సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా ఎప్పుడూ సూపర్‌స్టార్‌గానే ఉండాలంటే పర్సనాలిటీనే దోహదం చేస్తుంది. ఇందుకు రజనీకాంత్, పవన్‌కల్యాణ్, చిరంజీవిలాంటివారు ఉదాహరణ. వ్యక్తిత్వం నిండుగా ఉన్న నటుడు విశ్వక్సేన్. ‘రంగస్థలం’ చిత్రీకరణలో ఉండగా ‘ఉప్పెన’ ఫంక్షన్‌కు వచ్చా. అది రూ.100 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చా. ఇది కూడా అంత పెద్ద విజయం అందుకోవాలి” అని కోరుకున్నారు చరణ్.