మాస్… ఊర మాస్…
రంగస్థలం ఫస్ట్ లుక్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పమంటే ఈ పదం వాడాల్సిందే. ఆ లుక్ అలా వుందిమరి. రంగుల చొక్కా, లుంగీ, మెడలో కండువా… తీన్మార్ ఆడుతున్న పోజు… అన్నీ మాస్ ని ఆకట్టుకునేవే. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అచ్చమైన పల్లెటూరు కుర్రాడు చిట్టిబాబుని సుకుమార్ పరిచయం చేశారు ఇందులో. మార్చ్ 30 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతవరకు ఇంగ్లీష్ లో ఉన్న టైటిల్ లోగో… ఈసారి తెలుగులోకి మారింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కి రావాల్సిన సినిమా ఇది. పవన్ సినిమా కోసం పోస్ట్ పోన్ చేశారు. కానీ మరీ ఇలా మార్చ్ వరకూ వాయిదా పడుతుందని అభిమానులు ఊహించలేదు.