దక్షిణాది చిత్ర పరిశ్రమ లెజెండ్స్ ను మోడీ పట్టించుకోవడం లేదని.. వారం కిందట ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్ .. వైరల్ అయింది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారత సినీ ప్రముఖులకు విందు ఇచ్చిన ప్రధాని మోడీ దక్షిణాది ప్రముఖుల్ని మాత్రం మర్చిపోయారు. దీనిపై కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. అలాంటి వారిలో మొదటగా స్పందించిన వ్యక్తి ఉపాసన. మోడీ చాలా మంది దక్షిణాది సినీ ప్రముఖుల్లోనూ అసంతృప్తి ఉన్నప్పటికీ.. ఎవరికీ నోరు మెదిపే ధైర్యం మాత్రం లేదు. కానీ ఉపాసన మాత్రం.. చాలా డేర్‌గా ట్వీట్ చేశారు. మోడీ వివక్ష చూపిస్తున్నాని.. సున్నితంగానే చెప్పారు. ఉపాసన ట్వీట్‌కు… సోషల్ మీడియాలా బాగా సపోర్ట్ వచ్చింది. ఖుష్బూ లాంటి వాళ్లు మోడీ తీరుపై మరింత ఘాటుగా స్పందించారు. అయితే.. ఉపాసనకు.. సొంత ఇంటిలోనే సపోర్ట్ లభించినట్లుగా లేదు. ఈ ట్వీట్ విషయంపై రామ్చరమ్ అంత సంతృప్తిగా లేరని.. మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పకనే చెప్పారు.
ఉపాసన తనకు చెప్పకుండానే ట్వీట్ చేసిందని.. రామ్ చరణ్ నేరుగా … చెప్పేశారు. ఈ మాట ఉపాసన ట్వీట్‌కు తనకు ఏ సంబంధం లేదని.. చెప్పుకోవడానికి వర్కవుట్ అవుతుంది. అలాగే.. ట్వీట్ చేసిన విషయం తెలిసిన తర్వాత అలా ఎందుకు చేశావని కూడా క్లారిటీ అడిగానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చెబితే చేయనివ్వవని .. చేసేశానని.. ఉపాసన చెప్పినట్లు.. రామ్‌చరణ్ మీడియాకు చెప్పారు. అంటే.. తనకు తెలిసి ఉంటే.. ఆ ట్వీట్ చేయనిచ్చేవాడ్ని కాదని.. చెప్పకనే చెప్పారు మెగా హీరో. అంతే కాదు…తర్వాత తన భార్యను డిఫెండ్ చేసుకునే విషయంలోనూ.. వెనుకడుగు వేయలేదు. అందులో.. మోడీని ఎక్కడా విమర్శించలేదని.. కవర్ చేసుకున్నారు. మోడీని విమర్శించారో.. లేదో..ఆ ట్వీట్‌ను అర్థం చేసుకున్నవారికి తెలుస్తుంది. రామ్ చరణ్ కి అలా అర్థం కాకపోతే.. అ ట్వీట్ విషయంలో ఉపాసనను క్లారిటీ అడిగి ఉండే వారు కాదు.. తనకు తెలిస్తే చేయనిచ్చేవాడ్ని కాదని.. చెప్పుకునేవారు కాదనే సెటైర్లు పడుతున్నాయి.
ఉపాసన నేరుగా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారు కాదు. చిరంజీవి కోడలయిన తర్వాతే ఆమెకు టాలీవుడ్‌తో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. తన మామ గారైన చిరంజీవి లాంటి లెజెండ్‌ను… ఆ విందుకు ఆహ్వానించికపోవడంతోనే.. ఉపాసన అసంతృప్తికి గురై.. ఆ ట్వీట్ పెట్టి ఉంటారు. అయినా రామ్‌చరణ్… ఈ ట్వీట్ విషయంలో కంగారు పడటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.