చిత్రసీమ Vs మీడియా… ప్రస్తుతం వీటి మధ్యే పోరు. మీరెంత, అంటే మీరెంత? అనుకుంటూ ఈ రెండు పరిశ్రమలూ కాలు దువ్వుతున్నాయి. ఆడియో ఫంక్షన్లలోనూ… వీటి గురించే చర్చ. ఇప్పుడు `నా పేరు సూర్య` ఆడదియో వేడుకలోనూ ఇదే హాట్ టాపిక్ అయ్యింది. రామ్ చరణ్ స్పీచ్‌లో మీడియాకు కొన్ని చురకలు తగిలాయి. అవినీతి లేని పరిశ్రమ ఒక్క సినిమా పరిశ్రమే అని, అలాంటి చిత్రసీమని పట్టుకుని మీడియా ఏదేదో రాస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు చరణ్. పగలనక, రాత్రనక కష్టపడి పనిచేస్తామని, షూటింగుల్లో ఒళ్లు హూనం చేసుకుంటామని, ఒక్కోసారి దెబ్బలు కూడా తగులుతాయని, ప్రభాస్, బన్నీ, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఎన్నోసార్లు షూటింగ్లో దెబ్బలు తగిలించుకున్నారని గుర్తు చేశాడు చరణ్. ”మా నాన్న బాలకృష్ణ గారు కూడా అనేక సార్లు దెబ్బలు తగిలించుకున్నారు. ఏ అర్థరాత్రో ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్లాక కూడా సినిమా గురించే ఆలోచిస్తాం. ఓ గంట కూడా కుటుంబంతో గపడపలేం. ఇదంతా అభిమానులకు తెలుసు” అంటూ తన ఆవేశాన్ని వెళ్లగక్కాడు రామ్‌చరణ్.
‘నా పేరు సూర్య’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చరణ్.. చిత్రబృందానికి తన శుభాకాంక్షలు అందజేశాడు. చిరుతకు ముందు డాన్స్ విషయంలో తనకు ధైర్యం చెప్పింది బన్నీనే అని, బన్నీ హార్డ్ వర్క్ తనకు తెలుసన్నాడు చరణ్. గోన గన్నారెడ్డి లాంటి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు బాగా చేస్తాడని, ఆ పాత్రకు అవార్డులు వచ్చాయని, ఈ సినిమాకీ అవార్డులు రావడం గ్యారెంటీ అన్నాడు. వాస్తవికత, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు తమిళంలో ఎక్కువగా వచ్చేవని, అందుకే తమిళ దర్శకులతో పనిచేయాలనుకునేవాళ్లమని, అయితే యేడాది కాలంలో తెలుగులనూ అలాంటి సినిమాలు వస్తున్నాయని, `నా పేరు సూర్య` కూడా ఆ జాబితాలో చేరే చిత్రమవుతుందన్నాడు.