ధృవ తరవాత సుకుమార్‌తో కలసి ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. స్క్రిప్టు ఇప్పటికే పూర్తయ్యింది. లొకేషన్ల వేట కూడా ముగిసింది. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలెట్టేస్తారు. అయితే కథానాయిక ఎవరన్న విషయంలో ఇంత వరకూ ఓ క్లారిటీ రాలేదు. ముందు రాశీఖన్నాని అనుకొన్నారు. రాశీ – చరణ్‌లకు ఇది ఫస్ట్ కాంబో. దాంతో సినిమా గ్లామరెస్ గా ఉంటుందనుకొన్నారు మెగా ఫ్యాన్స్. ఆ తరవాత సమంత పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో కథానాయిక కోసం సమంతని సంప్రదించారని తాను ఓకే అన్నదని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. తనే… కీర్తి సురేష్.
నేను శైలజతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది కీర్తి. మొన్నొచ్చిన డబ్బింగ్ బొమ్మ రెమో సినిమాలోనూ ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. పవన్, మహేష్ సినిమాల్లో కథానాయికగా ఎంపికై ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది కీర్తి. ఒక్కసారిగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు చరణ్ సినిమాలోనూ కీర్తి సురేష్‌నే ఎంచుకోవాలని చూస్తున్నార్ట. రోజుకో పేరు వినిపిస్తోండడంతో అసలు చరణ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే కన్ఫ్యూజన్ మొదలైంది. నిజానికి చరణ్ కోసం రాశీఖన్నా పేరు పరిశీలించడం, ఆమెతో ఫొటో షూట్ జరపడం జరిగిపోయాయి. 90 శాతం రాశీనే కన్ఫామ్ అనుకొన్నారు. సడన్‌గా మిగిలిన వాళ్ల పేర్లు వచ్చేసరికి రాశీ కంగారు పడుతోందట. వచ్చిన అవకాశం ఎక్కడ చేయిదాటిపోతోందో అని. ఈ విషయమై సుకుమార్ సన్నిహితులు తెలుగు 360తో మాట్లాడుతూ ”రాశీతో ఫొటో షూట్ చేసిన మాట వాస్తవం. అయితే ఇంకా బెటర్ ఆప్షన్ కోసం అన్వేషిస్తున్నాం” అంటున్నాయి. ఆ ఆప్షనేదో తొందరగా చెప్పేస్తే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉండవు కదా?