కొంతమంది దర్శకులంతే. తమ పద్ధతిలో తాముంటారు. ట్రెండ్‌ని పట్టించుకోరు. ఎవ్వరిమాటా వినరు. సుకుమార్ కూడా అంతే. టాలీవుడ్లో ఉన్న ఇంటిలిజెంట్ డైరెక్టర్లలో సుక్కు ఒక్కడు. ఆ మాట కొస్తే.. అతనొక్కడే ఇంటిలిజెంట్ డైరెక్టర్. కాకపోతే, ఆ తెలివి తేటలు మరీ ఎక్కువైపోతుంటాయి. అదే భయం. అసలే ఆయన లెక్కల మాస్టారేమో తన ఫార్ములాని కథల్లోకి తీసుకొస్తుంటారు. దాంతో కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. వన్ – నేనొక్కడినే సినిమాఫ్లాప్ అవ్వడానికి కారణం అదే. నాన్నకు ప్రేమతో సినిమాకీ ఆ ఫార్ములాలే ముంచేసేవి. కానీ.. బతికి బట్టకట్టింది. ఇప్పుడు మరోసారి తాను నమ్ముకొన్న ఫార్ములాలనే సినిమా కథగా మలచుకొన్నాడట. చరణ్‌తో తీయబోయే సినిమాలోనూ అవే చూపిస్తాడట.
రామ్‌చరణ్‌తో సుకుమార్ ఓ సినిమా తీయబోతున్నాడు. అదీ సైన్స్ ఫిక్షన్ అట. సినిమా మొత్తం ఫార్ములాలే ఉంటాయట. దానికి తగ్గట్టు తన సినిమాకి ‘ఫార్ములా ఎక్స్’ అనే పేరు పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట సుకుమార్. ఓ స్టార్ హీరోని పెట్టుకొని ఇవేం టైటిళ్లు అని సుకుమార్‌ని సన్నిహితులు వారిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ సుక్కు వినే రకమేంటి? కాదుకదా.. కాబట్టి చరణ్ సినిమాకి ఈ టైటిలే ఫిక్సయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలోనూ తన లెక్కలతో గజిబిజి చేస్తే ప్రేక్షకులు ఏమైపోతారో. ఇన్ని దెబ్బలు తగులుతున్నా, విమర్శకులు సుక్కుని ఏకి పరేస్తున్నా.. తన ఫార్ములాని మాత్రం వదలడం లేదు. సుక్కు ఎప్పటికి మారతాడో ఏంటో?