చిరంజీవి 150వ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత అంటే… డబ్బులు పెట్టి వదిలేయడం లేదు. డాడీ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో తానే జోక్యం చేసుకొంటున్నాడట. చిరు కాస్ట్యూమ్స్, గెటప్ తదితర విషయాల్లోనూ చరణ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువవుతోందని టాక్. చిరు సినిమాకి సంబంధించిన కథానాయిక ఇంత వరకూ సెట్ కాలేదు. టైటిల్ ఏంటన్నది తేలలేదు. ఈ విషయాలు కూడా వినాయక్…చరణ్‌కే అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెపోలియన్, లెనిన్ అనే పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్ని కొత్త టైటిళ్లూ పరిశీలిస్తున్నారు. కానీ ఫైనలైజ్ చేసేది మాత్రం చరణేనట.
ఈ విషయంలో వినాయక్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. చిరు సినిమాపై భారీ అంచనాలుంటాయి. దానికి తోడు ఇది 150వ సినిమా. రేప్పొద్దుట రిజల్ట్ కాస్త అటూ ఇటూ అయితే.. అన్ని వేళ్లూ వినాయక్నే చూపిస్తాయి. ఆ ఇబ్బంది ఉండకూడదని చరణ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ ప్రాజెక్టులో ఉండేలా చూస్తున్నాడట. చరణ్ నిర్ణయాల ప్రకారమే సినిమా నడుస్తోంది కాబట్టి.. తనని విమర్శించే సాహసం చేయకపోవొచ్చన్నది వినాయక్ లాజిక్. అయితే… ప్రతీ విషయంలోనూ చరణ్ జోక్యం చేసుకోవడం వినాయక్ సన్నిహితులకు పెద్దగా రుచించడం లేదని తెలుస్తోంది. కానీ వినాయక్ లౌక్యం తెలిసినోడు, దానికి తోడు చిరు కుటుంబ వ్యవహార శైలిపై అవగాహన ఉన్నవాడు కాబట్టి కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు.