టాలీవుడ్ పరిశ్రమలో వర్గాలున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. ఎవరికి వారు తమ వర్గాన్ని బలపరిచే కార్యక్రమాల్లో అవతల వారిని శంఖించే విధంగా మాట్లాడుతారు. ఎవరు ఎలా ఉన్నా అందరికి తెలిసే విధంగా మాటల యుద్ధ చేస్తుంటారు దాసరి నారాయణ రావు, మెగా కుటుంబం.. ఆ రెండు వర్గాల మధ్యం వైరం గురించి అందరికి తెలిసిందే.. ఎక్కడైనా చరణ్ నోరు జారితే చాలు కావాలని ప్రెస్ మీట్ పెట్టి మరి వాయించేస్తాడు దాసరి.
అయితే కొద్దికాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో కీలకంగా మారిన దాసరి వాటికి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాలు తీయడం మొదలెట్టారు. అప్పట్లో తీసిన ‘మేస్త్రీ’ సినిమా ఒక సెన్షేషన్ క్రియేట్ చేసింది. సరిగ్గా ఎన్నికల ముందు విడుదల అయిన ఆ సినిమా నంది అవార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు చరణ్ ఆ సినిమాకు పోటీగానే ‘చోటామేస్త్రీ’ అనే సినిమా తీస్తున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్.
దాసరి లక్ష్యంగానే ఈ చోటామేస్త్రీ సినిమా తీసేందుకు రంగం సిద్ధ చేసుకున్నాడని.. తనకు రచ్చ లాంటి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు సంపత్ నందితో కథా చర్చల్లో పాల్గొననున్నాడని అంటున్నారు. మరోపక్క మాత్రం అలాంటిదేమీ లేదు మెగాస్టార్ ఎలాగు ‘ముఠామేస్త్రీ’ అని మాసివ్ హిట్ కొట్టాడు కాబట్టి చెర్రిని ‘చోటామేస్త్రీ’గా చూపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ సినిమా ఇటీవలే విడుదలయ్యి మొదటి ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకుంది.