బ్రూస్ లీ లాంటి అనూహ్య అపజయం ఎదురవ్వడంతో ప్రస్తుతం చరణ్ తను తీసే సినిమాకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చెర్రి ప్రస్తుతం చేస్తున్న సినిమా తని ఒరువన్ తెలుగు రీమేక్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ముందు బ్రూస్ లీ నిర్మించిన దానయ్యే ప్రొడ్యూస్ చేస్తాడనుకున్నా.. బ్రూస్ లీ తెచ్చిన నష్టాలతో ఆయన కాస్త సైడేపోయాడు. అందుకే అల్లు అరవింద్ రంగంలో దిగి సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యాడు.
కోలీవుడ్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తాని ఒరువన్ జయం రవి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామీ ప్రతినాయకుడిగా అదరగొట్టాడు. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకు టైటిల్ ‘రక్షక్’ అని పెట్టబోతున్నారట. మైండ్ గేంతో పోలీసులకు చుక్కలు చూపించే విలన్ ని హీరో ఎలా చేందించాడనేదే ఈ సినిమా కథ.
చెర్రి హీరోగా వస్తున్న తెలుగు తని ఒరువన్ రక్షక్ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం ఫైనల్ కాలేదు. సమంత, ఇలియానాల్లో ఎవరో ఒకరు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్. మరి స్టన్నింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.