హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రం ఆడియో వినాయకచవితి రోజున హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియోను విడుదల చేసిన రాం చరణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ డైరెక్టర్‌నూ తాను సినిమా చేయమని అడగలేదని, క్రిష్‌ను మాత్రమే ఐదేళ్ళనుంచి కథ చెప్పమని అడుగుతూ వస్తున్నానని చెప్పారు. అయితే ఇది పచ్చి అబద్ధం. ప్రముఖ తమిళ దర్శకులు మురుగదాస్‌ను, గౌతమ్ మీనన్‌ను తనతో చేయాలని సభాముఖంగా చరణ్ ఇంతకుముందు అడగటం సినిమా కార్యక్రమాలను క్లోజ్‌గా ఫాలో అయ్యేవారందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే చరణ్ మాత్రం ఈ విషయాన్ని మరిచిపోయినట్లుంది. ఆయనేమైనా గజనీగా మారిపోయారా లేకపోతే ఆయన ఉద్దేశ్యం తెలుగులో స్టార్ డైరెక్టర్లను అడగలేదనా అనేది తెలియటంలేదు.