హైదరాబాద్: మిత్రుడు సల్మాన్ ఖాన్ కోసం రాంచరణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. ఈ దీపావళికి రానున్న సల్మాన్ చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ను తెలుగులోకి డబ్ చేస్తున్నారని ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ కథనాన్ని వెలువరించింది. ఆ కథనం ప్రకారం – సల్మాన్ స్వయంగా చరణ్‌కు ఫోన్ చేసి ప్రేమ్ పాత్రకు చరణ్‌ను డబ్ చేయాలని కోరాడు. చరణ్ కూడా దానికి అంగీకరించాడు.
‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ను ప్రముఖ బాలీవుడ్ చలనచిత్రనిర్మాణ సంస్థ రాజశ్రీ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సంస్థ గతంలో 25 ఏళ్ళ క్రితం నిర్మించిన మై నే ప్యార్ కియా తెలుగులో ప్రేమ పావురాలుగానూ, హమ్ ఆప్ కే హై కౌన్ ప్రేమాలయంగానూ విడుదలై సూపర్ డూపర్ హిట్లయ్యాయి. తాజాగా ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి రాంచరణ్ వాయిస్ తోడైతే ఇదికూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే ఉద్దేశ్యంతో సల్మాన్ తన మిత్రుడిని డబ్బింగ్ చెప్పమని కోరాడు. సల్మాన్‌కు తన కుటుంబంతో ఉన్న అనుబంధందృష్ట్యా రాంచరణ్ ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించాడు. డబ్బింగ్ ఇవాళ హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ప్రారంభం కానుంది. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ పాటలు ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందాయి.