మీలో ఎవరు కోటీశ్వరులు (MEK) తొలి ఎపిసోడ్ అదిరిపోయింది. రామ్ చరణ్ ని అతిథిగా పిలిచి, హాట్ సీట్లో కూర్చోబెట్టి, పసందైన ప్రశ్నలు అడిగి – తొలి షోని సూపర్ సక్సెస్ చేశాడు ఎన్టీఆర్. `బుల్లితెరపై షోమేన్…` అంటూ చరణ్ కూడా ఎన్టీఆర్ కి కితాబిచ్చేశాడు. మొత్తానికి… హోస్ట్ గా తనకు తిరుగులేదని మరోసారి ఎన్టీఆర్ నిరూపించాడు.
అయితే ఇప్పుడు ఆ స్థానంలో రామ్ చరణ్ కూర్చోబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ హాట్ సీట్లోనూ.. చరణ్ కి హోస్ట్ సీట్లోనూ బుల్లితెర ప్రేక్షకులు చూడబోతున్నారు. అదీ ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే. MEK తొలి ఎపిసోడ్ చి చరణ్ తో ప్లాన్ చేసిన నిర్వాహకులు.. చివరి ఎపిసోడ్ కీ చరణ్ నే తీసుకురావాలని ఫిక్సయ్యార్ట. అయితే ఈసారి ఎన్టీఆర్‌ని చరణ్ ప్రశ్నలు అడుగుతాడని సమాచారం. స్టార్ మాలో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలోనూ ఇదే జరిగింది. చివరి ఎపిసోడ్ కి చిరు అతిథిగా వచ్చి, నాగార్జునపై ప్రశ్నలు సంధించారు. అదే ఫార్మెట్ ఇక్కడా అప్లై చేద్దామనుకుంటున్నారు నిర్వాహకులు. పైగా చివరి ఎపిసోడ్ సమయానికి `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్లు ముమ్మరంగా జరుగుతుంటాయి. ఆ సినిమా ప్రచారంలో MEK కూడా ఓ భాగం అవుతుందన్నది ప్లాన్.