రామ్‌చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ తెలుగు కథలతోనే రూపొందినవే. ఫస్ట్‌టైమ్ తమిళ్లో సూపర్‌హిట్ అయిన ‘తని ఒరువన్’ చిత్రం రీమేక్‌లో నటిస్తున్నాడు. ‘బ్రూస్లీ’ ఫ్లాప్‌తో చరణ్‌కి జ్ఞానోదయం అయినట్టుంది. అందుకే మరో తెలుగు కథ కోసం చూడకుండా రీమేక్ చెయ్యడానికి డిసైడ్ అయిపోయాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ‘తని ఒరువన్’ రీమేక్ షూటింగ్ ఫిబ్రవరి 16న స్టార్ట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్ర కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసే పనిలో నిమగ్నమై వున్నాడు డైరెక్టర్ సురేందర్‌రెడ్డి.
చరణ్ చెయ్యబోయే ఈ కొత్త సినిమా స్టార్ట్ అవ్వకుండానే మరో సినిమా రీమేక్ హక్కులు తీసుకునేందుకు రెడీ అయిపోయాడు చరణ్. బాలీవుడ్లో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న ‘రాఖీ హ్యాండ్సమ్’ చిత్రం రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు చరణ్. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న శృతి హాసన్‌కి కథ బాగా నచ్చడంతో ఆ కథని చరణ్‌కి కూడా వినిపించిందట. చరణ్ కూడా కథ విని బాగా ఎక్సైట్ అయ్యాడట. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘రాఖీ హ్యాండ్సమ్’ తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఈ స్టెప్ తీసుకుంటున్నాడు చరణ్. త్వరలోనే ఈ రీమేక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.